Minister Atchannaidu : గుంటూరు/అమరావతి : రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని , కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని డబల్ ఇంజన్ సర్కార్ రైతులకు మేలు చేసే కార్యక్రమాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. గుంటూరు లాంలోని ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం కృష్ణా అడిటోరియంలో న్యూడిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ పీఎం ధన్ ధాన్య కృషి యోజన , పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య యోజన రైతుల ఆర్థిక శక్తివంతతకు దారి తీస్తుందని చెప్పారు. పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి దిశగా పెద్ద అడుగు అని ఆకాంక్షించారు.
Minister Atchannaidu Key Comments
దేశవ్యాప్తంగా రూ. 42,000 కోట్లు విలువైన వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక తదితర అనుబంధ రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పీఎం ధన్ – ధాన్య కృషి యోజన ద్వారా దేశంలో 100 జిల్లాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి రైతులకు కేంద్ర ప్రభుత్వం 30 పథకాల ద్వారా ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు కింజరాపు అచ్చెన్నాయుడు. పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం అని, ప్రధాని మోదీ దృష్టిలో ప్రతి రైతు సమృద్ధి భవిష్యత్తు చిహ్నం అని చెప్పారు. పీఎం ధన్ – ధాన్య కృషి యోజనలొ రాష్ట్రంలో ఎంపికైన అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య జిల్లాలలో రానున్న ఆరు సంవత్సరాలు అవస్థాపన సౌకర్యాలపై దృష్టి పెడతామని చెప్పారు.
Also Read : DK Shivakumar Shocking Comments : అధిష్టానం చేతుల్లోనే మంత్రివర్గ విస్తరణ


















