బ‌ర్డ్ ఫ్లూపై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు

స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

hellotelugu-Atchannaidu

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను (బ‌ర్డ్ ఫ్లూ) పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం అని చెప్పారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పక్షి ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేద‌న్నారు. అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం గ్రామాల్లో వ్యాధి నిర్ధారణ గురించి ఆరా తీస్తున్నామ‌న్నారు. భోపాల్ నివేదికలతో కేంద్రం ద్వారా అధికారిక నిర్ధారణ పై ఫోక‌స్ పెట్టామ‌న్నారు మంత్రి. నిర్ధారణ వెంటనే రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ మోహరించామ‌న్నారు. ఎస్ఓపీల ప్ర‌కారం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు కింజార‌పు అచ్చెన్నాయుడు.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అన్ని శాఖలతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో నిన్న రెండు పొలాల్లో క‌ల్లింగ్ చ‌ల్ల‌డం పూర్త‌యింద‌ని చెప్పారు. సోడమ్, కర్వేటినగరం నుంచి రెండు అదనపు నమూనాలు భోపాల్‌ ప్రయోగశాలకు పంపించిన‌ట్లు తెలిపారు. కర్వేటినగరం పొలాన్ని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సందర్శించారని తెలిపారు, రైతులు, సిబ్బందికి వ్యాధి నియంత్రణ ప్రోటోకాల్‌లపై మార్గనిర్దేశం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రభావిత ప్రాంతాల్లో, పరిసరాల్లో కట్టుదిట్ట నియంత్రణ చర్యలు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. కోడి మాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితంగా ఉంద‌న్నారు. కోళ్ల పెంపకందారులు బయోసెక్యూరిటీ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు

Exit mobile version