Minister Atchannaidu : అమరావతి : రాష్ట్రంలో రైతులు పండించిన నల్లబర్లీ పొగాకు కొనుగోళ్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్ నెలాఖరు వరకు నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి కావాల్సిందేనని మార్క్ ఫెడ్ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో వ్యవసాయ శాఖ, అనుబంద శాఖల ఉన్నతాధికారులతో పొగాకు, ప్రత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు శ్రమ వృథా కాకుండా, మార్కెట్‌లో సమయానికి పంట కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రైతు ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. వాణిజ్య కేంద్రాల్లో ఎటువంటి అవినీతి, ఇబ్బందులు చోటుచేసుకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించామని, రైతు శ్రేయస్సే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు.
Minister Atchannaidu Key Comments
రాష్ట్రంలో నల్లబర్లీ పొగాకును 80 మిలియన్ కిలోలు పండించటం జరిగిందని, ఇప్పటి వరకు 22 కంపెనీలు 40 మిలియన్ కిలోలు కొన్నారని, అదే విధంగా 15 మిలియన్ కిలోలు ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 55 మిలియన్ కిలోలు కొనడంతో ఇంకా 20 మిలియన్ కిలోలు ప్రయివేట్ కంపెనీ వారు అత్యవసరంగా ఈ నెల చివరి లోగా కొనాలని ఆదేశించారు. మిగిలిన 5 కిలోలు మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు. 2025-26 రబి సీజన్ లో నల్లబెర్లి పొగాకు ను ఎవరు పండించ కూడదని ఇందుకోసం 740 జీవో విడుదల చేసామన్నారు. కంపెనీలతో ఎంఓయీలు చేసుకున్న రైతులు మాత్రమే తెల్ల బర్లీ పోగాకును పండించాలని అన్నారు. నల్ల బర్లీ పంటను వేయకుండా రైతులు శనగలు, మినుములు, పెసలు, జొన్నలు, మొక్కజొన్న వంటి పంటలను వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
Also Read : YS Jagan Fired on CM Chandrababu : చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ
















