Minister Atchannaidu : అమరావతి : ఏపీ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఈనెల 19వ తేదీన బుధవారం ఏకంగా భారీ మొత్తంలో నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కంజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రెండో విడత 46,62,904, లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. ఈ పథకం కింద రూ.3077.77 కోట్లు రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేయనున్నాయని చెప్పారు. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
Minister Atchannaidu Key Comments
అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు కింజరాపు అచ్చెన్నాయుడు. తొలి విడతలో జమకానివి రైతుల నుంచి వచ్చిన పిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్న వారికి అన్నదాత సుఖీభవ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరగాలని స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్‌లో నమెదు కానివి, అర్హత ఉన్నవారికి అందలేదని రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్న రైతులకు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కింది స్ధాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
Also Read : Hydraa Shocking : భవనాల కూల్చివేత రహదారుల పునరుద్దరణ


















