Minister Anitha : అమరావతి : దిత్వా తుపాను తీవ్రత కారణంగా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆదివారం సచివాలయంలో ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) సమీక్ష చేపట్టారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవాళ, రేపు కూడా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి. క్షేత్ర స్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
Home Minister Anitha Gives Clear Instructions
ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు వంగలపూడి అనిత. సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించాలని కోరారు.ప్రమాద స్పాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని స్పష్టం చేశారు. జన జీవనానికి అడ్డంకులు కలిగించే విరిగిన కొమ్మలు, హార్డింగ్స్ వంటివి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వంగలపూడి అనిత. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని అన్నారు. ఈ సందర్బంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్లు తెలిపారు.అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించింది. నైరుతి బంగాళా ఖాతంలో ‘దిత్వా’ తుపాను కేంద్రీకృతమై ఉందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్.ప్రస్తుతానికి ఇది కారైకాల్ కి 100 కి,మీ. , పుదుచ్చేరికి 110 కి.మీ, చెన్నైకి 180కి.మీ దూరంలో ఉందన్నారు. గడిచిన 6 గంటల్లో 12కి.మీ వేగంతో తుపాను కదిలిందని పేర్కొన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎండీ.
Also Read : KTR Shocking Comments on Govt : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం : కేటీఆర్
















