Minister Anitha : అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో శనివారం హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి (Minister Anitha) సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలని ఆదేశించారు. సహయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్ష సూచన ఉందని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అనిత.
Home Minister Anitha Key Comments on Cyclone
ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు హోం మంత్రి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియ జేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలెర్ట్ గా ఉండాలని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలని స్పష్టం చేశారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని సూచించారు అనిత వంగలపూడి. శిధిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.
Also Read : Global Summit 2025 Important Update : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు















