Minister Anitha : అమరావతి : ఇండస్ట్రియల్ పార్కు ద్వారా సుమారు 6 వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha). మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంలో వరాహ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు ఈ సందర్బంగా మంత్రి. ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా సుమారు 6 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయని ప్రకటించారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ప్రయత్నం చేయాలని సూచించారు వంగలపూడి అనిత.
Minister Anitha Important Update
పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తమ కూటమి సర్కార్ ఎర్ర తివాచీ పరుస్తోందని చెప్పారు. అంతే కాకుండా ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ అమెరికా తర్వాత ఇండియాలోని ఏపీ రాష్ట్రం విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్ ను ఏర్పాటు చేసిందన్నారు. సమర్థవంతమైన నాయకుడైన నారా చంద్రాబు నాయుడు సీఎంగా ఉండడం వల్లనే దిగ్గజ కంపెనీలు రాష్ట్రానిక తరలి వస్తున్నాయని చెప్పారు వంగలపూడి అనిత. రాబోయే రోజులలో ఏపీని ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలకు కేరాఫ్ గా మారుస్తామన్నారు. ఇప్పటికే పర్యాటక రంగానికి సంబంధించి ఏపీని కేరాఫ్ గా మార్చేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మంత్రి.
Also Read : Popular Director Rajamouli Movie : 15న రాజమౌళి గ్లోబ్‌ట్రాటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్


















