Minister Anam : అమరావతి – రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam) నిప్పులు చెరిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన నోటి దురుసు తగ్గించు కోవాలని సూచించారు. చిల్లర రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు. ఒక మహిళా ప్రజా ప్రతినిధిని పట్టుకుని నీచంగా కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మీఇంట్లో మహిళలను ఇలాగే అంటే ఊరుకుంటావా అని ప్రశ్నించారు.
Minister Anam Ramanarayana Reddy Warning to
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎంత చెప్పినా వైసీపీ నేతలు మారడం లేదన్నారు ఆనం రామ నారాయణ రెడ్డి. సభ్యసమాజం తలదించుకునేలా మహిళ శాసన సభ్యురాలిపై వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడే వైసీపీ నేతల సంస్కృతి తగదన్నారు. ఇందుకే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అయినా జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి బుద్ది రావడం లేదన్నారు.
వైసీపీ నేతల మాటలు మహిళల ఆత్మ గౌరవాన్ని తూట్లు పొడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. మహిళల గౌరవాన్ని తుంచే చింతనను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై చట్ట పరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యేపై నోరు పారేసుకున్న తనపై వేటు వేయాలని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూచించారు మంత్రి.
Also Read : Malothu Kavitha Warning : దాసరి సీతక్క కామెంట్స్ మాలోతు కవిత వార్నింగ్















