Minister Anam Interesting Comments : సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యం

మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి

Hello Telugu - Minister Anam Interesting Comments

Hello Telugu - Minister Anam Interesting Comments

Minister Anam : నంద్యాల జిల్లా – తమ టీడీపీ కూట‌మి స‌ర్కార్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌ని చేస్తోంద‌ని అన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి (Minister Anam). మంగ‌ళ‌వారం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యురాలు గౌరు చరిత తో కలిసి దుర్వేసి గ్రామంలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సూపర్ సిక్స్ పథకాల లబ్ధిదారుల తో మంత్రి ఆనం, ఎమ్మెల్యే గౌరు చరిత, స్థానిక ప్రజాప్రతినిధులతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు.

Minister Anam Ramanarayana Reddy Key Comments

గడపగడపకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం లో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంద‌ని చెప్పారు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. గ‌తంలో రాష్ట్రాన్ని పాలించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌జా సంక్షేమం గురించి ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. దీంతో ప్ర‌జ‌లు గ‌తంలో జ‌రిగిన శాస‌న సభ ఎన్నిక‌ల్లో వైసీపీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని అన్నారు. అయినా జ‌గ‌న్ రెడ్డికి, త‌న ప‌రివారానికి బుద్ది రాలేద‌న్నారు.

కావాల‌ని కూట‌మి స‌ర్కార్ ను అయిన‌దానికి కానిదానికి బ‌ద్నాం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌త్యేకించి దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ‌కు ఇచ్చామ‌న్నారు.

Also Read : Sri Kodandarama Temple Interesting : శ్రీ కోదండ రామాలయంలో పవిత్ర సమర్పణ

Exit mobile version