Minister Anam Interesting Update : సీఎం చంద్ర‌బాబు నాయుడు అరుదైన రికార్డ్

సెప్టెంబ‌ర్ 1, 1995లో సీఎంగా ప్ర‌మాణం

Hello Telugu - Minister Anam Interesting Update

Hello Telugu - Minister Anam Interesting Update

Minister Anam : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అరుదైన ఘ‌న‌త సాధించారు. స‌రిగ్గా ఇదే రోజు సెప్టెంబ‌ర్ 1, 1995వ సంవ‌త్స‌రంలో తొలిసారిగా ఆయ‌న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రేదేశ్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో త‌న రాజ‌కీయ జీవితంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌త్యేకించి రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి (Minister Anam) ముఖ్య‌మంత్రిని స్వ‌యంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.

Minister Anam Ramanarayana Reddy Key Comments

అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. త‌న‌కు చంద్ర‌బాబు నాయుడుకు (CM Chandrababu) మ‌ధ్య అనుబంధం ఉంద‌న్నారు. ఆనాటి నుంచి నేటి దాకా నాలుగుసార్లు సీఎంగా ప‌ని చేశార‌ని చెప్పారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. మొదటి, రెండో సార్లలో 8 సంవత్సరాలు 8 నెలలు 13 రోజులు సీఎంగా కొనసాగార‌ని చెప్పారు. ఆనాడు హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే ద‌క్కుతుంద‌న్నారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

నేటి ఆధునిక తెలంగాణకు సాంకేతిక, మౌలిక వసతుల బలమైన పునాది చంద్రబాబే వేశాడ‌ని కొనియాడారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని రూపకల్పన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా అభివృద్ధి, రాయలసీమలో పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడం వంటి పలు ప్రధాన కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. దేశ రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా కీలక పాత్ర పోషించి, జాతీయ స్థాయిలోనూ తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచిన అరుదైన నాయకుడు చంద్రబాబేన‌న్నారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి.

30 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో 15 సంవత్సరాలకు పైగా సీఎంగా పని చేయడం ఒక విశిష్టమైన రికార్డు. ఇంత దీర్ఘకాలం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టు కోవడం చంద్రబాబు నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు.

Also Read : CM Revanth Reddy Shocking Comments : కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐకి అప్ప‌గింత‌

Exit mobile version