Miamin Corporation : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు మరో దిగ్గజ కంపెనీ రానుంది. ఈ మేరకు సదరు కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా ఏకంగా 4 లక్షల చ.అడుగుల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది మియామిన్ కార్పొరేషన్ (Miamin Corporation). దాదాపు 1000కి పైగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ కంపెనీ వైమానిక సంస్థ తరపున జాబ్ రిక్రూట్ మెంట్ చేస్తూ వస్తోంది గత కొంత కాలంగా. భారీ ప్యాకేజీలతో ఉద్యోగాల ఆఫర్ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు క్లయింట్ ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు మియామిన్ కార్పొరేషన్. ఫార్చ్యూన్ 500 జాబితాలోని కంపెనీ అంటూ ప్రచారం జరుగుతోంది. బోయింగ్, ఎమిరేట్స్‌లో ఒక కంపెనీ కావచ్చంటూ చర్చ కొనసాగుతోంది.
Miamin Corporation Huge Investment in Hyderabad
త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే హైదరాబాద్‌లో 75 అంతర్జాతీయ కంపెనీలు కొలువు తీరి ఉన్నాయి. ఇందులో వరల్డ్ వైడ్ గా టాప్ లో కొనసాగుతున్న ఐటీ కంపెనీలతో పాటు లాజిస్టిక్ కంపెనీలు కూడా కొలువు తీరాయి. వీటిలో గూగుల్, మైక్రో సాఫ్ట్, పొలారిస్, అమెజాన్ , విప్రో, ఇన్ఫోసిస్ , జెన్ పాక్ట్ , క్యాప్ జెమిని, లాంటి కంపెనీలు ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను దాటేసి హైదరాబాద్‌కే జై కొడుతున్నాయి దిగ్గజ కంపెనీలు. ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్ లో కొలువు దీరాయి 31 ఫార్చ్యూన్ కంపెనీలు.
Also Read : Minister Savitha Important Update : బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ కోచింగ్



















