Mettu Sai Kumar : హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏకి పారేశారు ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar). ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ బిల్డప్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. 2014 లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ పార్టీలో చేరి మంత్రి అయ్యారో మరిచి పోయి మాట్లడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు కేసీఆర్ పెద్ద నాయకుడు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పొగడటం బాగో లేదన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం తనకు అలవాటేనని ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్, అమర వీరుల స్థూపం నిర్మాణాల్లో అంచనాలు ఎందుకు పెరిగాయో చెప్పాలని మెట్టు సాయి కుమార్ డిమాండ్ చేశారు.
Mettu Sai Kumar Shocking Comments on Talasani Srinivas Yadav
తెలంగాణ ఉద్యమాన్ని ,ఉద్యమ కారులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అవమానించిన విషయం అప్పుడే మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పదాన్ని, ఉద్యమ నేపద్యాన్ని చంపింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంతో దోస్తానా చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అబద్దాలు బాగా నేర్చారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుందని , దాని విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ ఉద్యమం గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు మెట్టు సాయి కుమార్. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు.
Also Read : CM Revanth Reddy New Innovation : డిసెంబర్ 6న ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్
