MEIL Director Dorayya : హైదరాబాద్ : మేఘా కృష్ణారెడ్డికి చెందిన కంపెనీకి భారీ ఎత్తున ప్రాజెక్టు లభించింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దమొత్తంలో దక్కడం విశేషం. ఈ విషయాన్ని ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్ దొరయ్య (MEIL Director Dorayya) శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్బంగా తమ కంపెనీకి భారీ ప్రాజెక్టు దక్కిందని తెలిపారు. ఇందులో భాగంగా కువైట్ లో 225.5 మిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సాధించడం జరిగిందన్నారు. కేఓసీకి గ్యాస్ స్వీటెనింగ్ ప్లాంట్, సల్ఫర్ రికవరీ యూనిట్ నిర్మించి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బిల్డ్ ఓన్ ఆపరేట్ పద్దతిలో కువైట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు దొరయ్య. తమ కంపెనీ లక్ష్యం కేవలం 790 రోజుల్లో ఆ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
MEIL Director Dorayya Key Update
ఆ తరువాత ఐదు సంవత్సరాల పాటు ప్లాంట్ నిర్వహణ బాధ్యతల్లో తమ కంపెనీ ఎంఈఐఎల్ పాలు పంచుకునేలా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తమ కంపెనీ ఆధ్వర్యంలో రాజస్థాన్, మంగోల్ రిఫైనరీలలో సల్ఫర్ రికవరీ యూనిట్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా తాగునీరు , హైడ్రోకార్బన్ , పవర్ వంటి రంగాల్లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా విజయవంతంగా ప్రాజెక్టులు అమలు చేస్తూ వస్తోంది తమ కంపెనీ అని వెల్లడించారు డైరెక్టర్ దొరయ్య. కువైట్ ప్రాజెక్ట్ తో మధ్యప్రాచ్యంలో మరింత బలోపేతం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణంగా ఉందన్నారు.
Also Read : Super GST Super Savings- Pawan Kalyan : పెట్టుబడులు రావాలంటే సర్కార్ పై నమ్మకం ఉండాలి



















