హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు అనిల్ రావిపూడి. తను తీసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరితో కలిసి తీసిన సంక్రాంతికి వస్తున్నాం ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి సినీ వర్గాలను, ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పోయేలా చేసింది. ఈ క్రెడిట్ అంతా అనిల్ రావిపూడికే దక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జానర్ ను తప్పకుండా సినిమాలను , కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా తను తొలిసారిగా దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవితో మూవీ తీశాడు. అదే మన శంకర ప్రసాద్ గారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.
హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన ప్రకటన చేశాడు. 2026 జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర ప్రసాద్ గారు సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ సంబురాలలో మునిగి పోయారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. మీసాల పిల్ల సాంగ్ టాప్ లో కొనసాగుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు అనిల్ రావిపూడి. ఇక మెగాస్టార్ చిరంజీవికి తోడుగా ప్రముఖ హీరోయిన్ నయనతార నటించింది. ఈ చిత్రానికి ఓ స్పెషల్ కూడా ఉంది. ఇందులో ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేశ్ కూడా నటించడం విశేషం.


















