MDF Huge Manufacturing Unit : ఎండిఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్

ప్ర‌క‌టించిన యాక్ష‌న్ టెసా ఎండీ వివేక్ జైన్

Hello Telugu - MDF Huge Manufacturing Unit

Hello Telugu - MDF Huge Manufacturing Unit

MDF : విశాఖ‌ప‌ట్నం : యాక్షన్ టెసా మేనేజింగ్ డైరెక్ట‌ర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ ( సీఈవో) వివేక్ జైన్ ఏపీ స‌ర్కార్ కు తీపి క‌బురు చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది విశాఖ న‌గ‌రం వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు. ఈ స‌ద‌స్సులో సంస్థ ఎండీ, సీఈఓ జైన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తో భేటీ అయ్యారు. యాక్షన్ టెసా భారత దేశంలోని ప్రముఖ ఇంజనీర్డ్ వుడ్ ప్యానెల్ తయారీదారుగా ఉంది. 1970లలో స్థాపితమైన ఈ సంస్థ పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, రసాయనాలు, ఫ్లెక్స్ తయారీ, బొగ్గు మైనింగ్, ఇంజనీర్డ్ వుడ్ ఉత్పత్తులలో విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

MDF Company Put Huge Investment ai AP

ఏపీలో సెకండరీ,శాటిలైట్ ఎండిఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని త‌న‌తో భేటీ అయిన సంద‌ర్బంగా యాక్ష‌న్ టెసా సంస్థ ఎండీ, సీఈఓ వివేక్ జైన్ ను కోరారు మంత్రి నారా లోకేష్‌. మంత్రి చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు సంస్థ ఎండీ సానుకూలంగా స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌మ కంపెనీ త‌ర‌పున ఎండీఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు వివేక్ జైన్. ఈ సంద‌ర్భంగా సంస్థ నిర్వాహ‌కుల‌కు ప్ర‌త్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలిపారు నారా లోకేష్‌.

Also Read : Minister Nara Lokesh Strong Challenge : ఏపీని సెమీ కండ‌క్ట‌ర్స్ హ‌బ్ గా మారుస్తాం

Exit mobile version