తిరుపతి : తిరుపతి లోని నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో మార్చి 21న శనివారం మత్స్య జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేద నారాయణ స్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం (తిరువీధి ఉత్సవం) నిర్వహించారు.
ఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు . రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామి వారు ఆలయ మాఢ వీదులలో ఉరేగుతు భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా మత్స్య జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) .
