హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. నగరంలోని అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించింది. ఈ ఆపరేషన్ లో రెవిన్యూ, మున్సిపల్ అధికారులు ఈ ఆపరషన్ లో పాల్గొన్నారు. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు చేపట్టింది. పేదల ఇళ్లను ముట్టుకోలేదు హైడ్రా. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన ముఖీం గెస్ట్ హౌస్ తో పాటు, తన సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా తొలగించింది . దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో ఇళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంది హైడ్రా.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడాలని సర్కార్ నిర్ణయించింది. 863 ఎకరాల భూమి విలువ 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించు కోకుండా ముఖీం గెస్ట్ హౌస్ నిర్మించారు. ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండడం లేదు. కొంతమందిని ఆప్పటికప్పుడు అద్దెలకు దించి నివాసాలున్నట్టు చూపించే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు.
