హైదరాబాద్ : శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించిన చిత్రం ఇరుమడి. ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఆదరణ పొందింది. ఈ ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ప్రేక్షకుల నుండి గొప్ప ఆదరణ పొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు సినిమాపై వచ్చిన సానుకూల స్పందన బాగా కలిసొచ్చింది. భారీ ఎత్తున టికెట్లు అమ్ముడు పోతుండడంతో దర్శక, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
ఈ చిత్రం మూడవ రోజున బలమైన స్పందనను నమోదు చేసింది. నివేదికల ప్రకారం ఆదివారం నాడు ‘బుక్‌మైషో’ లో ఏకంగా 4,05,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అనేక షోలు ‘హౌస్‌ఫుల్’ అయ్యాయి. ఈ సినిమా ఇప్పటికే మొదటి రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ మార్కును దాటగా, ఆదివారం కూడా టిక్కెట్ల డిమాండ్ బలంగా కొనసాగింది. మొత్తం 25 లక్షలకు (2.5 మిలియన్లకు) పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది సినిమా పట్ల పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తోంది. మరో వైపు సోమవారం నాటి భారీ బుకింగ్‌లు కూడా సినిమా జోరును మరింత పెంచాయి. ప్రేక్షకుల మద్దతు ఇలాగే కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో ‘ఇరుముడి’ మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని అంచనా.


















