ప్ర‌తిభ, వేగంలోనూ మ‌ణిర‌త్నం వెరీ స్పెష‌ల్

కేవ‌లం మూడు నెల ల్లోనే సినిమా షూటింగ్ క్లోజ్

hellotelugu-Maniratnam

చెన్నై : భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గిన సినీ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు తమిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌ణిర‌త్నం. ఆయ‌న ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారారు డైరెక్ట‌ర్. ప్ర‌త్యేకించి ప్రతిభ లోనూ, వేగంలోనూ మణి రత్నంకు సాటిలేరు ఎవ‌రూ. ఆయ‌న ద‌రికి వ‌చ్చే వారిలో కూడా ఎవ‌రూ లేర‌ని చెప్పక త‌ప్ప‌దు. టేకింగ్, మేకింగ్ లో త‌ను వెరీ స్పెష‌ల్. త‌ను గ‌తంలో రోజా మూవీ తీసిన‌ప్పుడు షూటింగ్ స‌మ‌యంలో ఎలా ఉన్నారో ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి, సాయి ప‌ల్లితో తీసిన మూవీ షూటింగ్ లో కూడా అదే ఉత్సాహంతో క‌నిపించారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం త‌న‌కు సినిమా ప‌ట్ల ఉన్న మ‌క్కువ, దాని ప‌ట్ల ప్రేమ‌, నిబ‌ద్ద‌త‌. ఈ వయసులో ఇంజి వెల్లం సెట్‌లో మణి రత్నం చూపిన శక్తి, మొత్తం షూటింగ్‌ను మెరుపు వేగంతో పూర్తి చేయడం నిజంగా స్ఫూర్తిదాయకం .

ప్ర‌స్తుతం తెలుగు దర్శకులు 200 నుండి 300 రోజులు సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో తమిళ దర్శకుడు మణి రత్నం ఒక మార్గాన్ని చూపించారు. దిగ్గజ చిత్ర నిర్మాత తదుపరి విడుదల ‘ఇంజి వెల్లం’, విజయ్ సేతుపతి , సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన ఒక రొమాంటిక్ డ్రామా. కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు పూర్తయింది. ఇంజి వెల్లం జూలై 23న ప్రారంభమైంది. కేవ‌లం మూడు నెలల లోపే నిర్మాణం పూర్తయింది. చాలా మంది యువ దర్శకులు షూటింగ్‌లను పూర్తి చేయడానికి చాలా కాలం తీసుకుంటుండటంతో, బడ్జెట్‌లు పెరిగిపోతున్న తరుణంలో ఈ వయసులో మణి రత్నం మొత్తం షూటింగ్‌ను మెరుపు వేగంతో పూర్తి చేయడం విస్తు పోయేలా చేస్తోంది.

సినిమాకు సంబంధించి ప్రణాళిక పకడ్బందీగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ , ఇండియా టాకీస్‌ల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2027 పొంగల్‌కు విడుదల కానుంది. మణి రత్నం తన చివరి చిత్రం ‘థగ్ లైఫ్’తో నిజంగా నిరాశ పరిచారు, ఒక కొత్త తరం ప్రేమకథతో ఆయన తనను తాను నిరూపించుకుంటారని ఆశిస్తున్నారు అభిమానులు.

Exit mobile version