దూసుకు పోతున్న ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’

వ‌రుస‌గా పాజిటివ్ టాక్ తో పెను సంచ‌ల‌నం

hellotelugu-ManaShankaraVaraPrasadGaru

హైద‌రాబాద్ : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌ను తీసిన ప్ర‌తి మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ న‌టించిన రాజా సాబ్ , ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ఆశించిన మేర ఆడ‌లేదు. దీంతో తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు ఆయా న‌టీ న‌టుల ఫ్యాన్స్. కానీ మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, న‌య‌న‌తార‌, విటీకే గ‌ణేశ్ కీల‌క పాత్ర‌లు పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు చిత్రం ఊహించ‌ని రీతిలో కాసుల‌ను పండిస్తోంది. ఈనెల 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైంది. తొలి రోజు రూ. 84 కోట్లు వ‌సూలు చేయ‌గా రెండో రోజూ కూడా అదే ఒరవ‌డిని కొన‌సాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇంటిల్లిపాదిని పూర్తిగా కామెడీ, వినోదాన్ని అందించేలా చేయ‌డంలో ద‌ర్వ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. బ్రేక్ ఈవెన్ రావాలంటే మొత్తం రూ. 280 కోట్ల వ‌సూలు కావాల్సి ఉంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్లు రెండో రోజు వ‌సూలు చేయ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ మెస్మ‌రైజ్ చేసింది. ప్ర‌త్యేకించి మేకింగ్, టేకింగ్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ గా సినిమాను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లాడు. ప్ర‌త్యేకించి మెగాస్టార్ కు ఎనిమిది సంవ‌త్స‌రాల త‌ర్వాత భారీ విజ‌యాన్ని కట్ట‌బెట్టాడు. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వ్య‌క్తం అవుతోంది. సంక్రాంతి పండుగ వేళ మ‌రింత సంబురాల‌లో మునిగి పోయారు చిరంజీవి, భార్య సురేఖ‌, కోడ‌లు ఉపాస‌న కొణిద‌ల‌, రామ్ చ‌ర‌ణ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు కొణిద‌ల‌, త‌దిత‌రులు.

Exit mobile version