Malothu Kavitha : హైదరాబాద్ – ఆదివాసీ బిడ్డ అనే కార్డు వాడుకుని కేటీఆర్ గురించి అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మాలోతు కవిత (Malothu Kavitha). ఎన్నికల ముందు స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా నటించిందని, గెలిచాక మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిజంగా గిరిజన బిడ్డవే అయితే జీవో 49 ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలన్నారు. నీ అనుచరుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోలేదా అని ప్రశ్నించారు. ఇంకోసారి కేటీఆర్ గురించి నోరు జారితే బాగుండదన్నారు.
Malothu Kavitha Warning
మంత్రి పదవి రాగానే కళ్లు నెత్తికి ఎక్కాయని సంచలన ఆరోపణలు చేశారు మాలోతు కవిత. ములుగు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పేట్రేగి పోతున్నాయని ఎవరూ ప్రశ్నించినా వారిపై బలవంతంగా ఒత్తిళ్లకు గురి చేయడం, అక్రమంగా కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. అందుకే మావోయిస్టులు నిన్ను హెచ్చరిస్తూ లేఖ రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను ఏదో ప్రజా సేవ చేస్తున్నానని బిల్డప్ ఇవ్వడం తప్పితే మంత్రిగా చేసింది ఏముందంటూ నిప్పులు చెరిగారు మాలోతు కవిత.
ఇంకోసారి గనుక తమ పార్టీ నాయకుడు , మాజీ మంత్రి కేటీఆర్ గురించి కానీ లేదా కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి కానీ కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమని తగిన రీతిలో ఎలా జవాబు చెప్పాలో తమకు బాగా తెలుసన్నారు మాలోతు కవిత. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరాగి చేసుకుని పేట్రేగి పోతే ఇబ్బందులు తప్పవన్నారు.
Also Read : TTD EO Interesting Comments : ఏఐ టెక్నాలజీతో సకాలంలో శ్రీవారి దర్శనం – ఈవో
















