Mallikarjun Kharge : గుజరాత్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్ ఆనాడు మండిపోతున్నా, దారుణాలతో తల్లడిల్లినా ఒక్క మాట కూడా మాట్లాడేందుకు ఇష్ట పడలేదని ఇవాళ నిస్సిగ్గుగా మణిపూర్ రాష్ట్రంలో పర్యటించడం దారుణమన్నారు. తన వ్యక్తిగత ప్రచారం కోసం తప్ప ఆయన మణిపూర్ కు గానీ,
దేశానికి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఖర్గే. ఆయన తన పర్యటనతో దేశాన్ని, రాష్ట్ర వాసులను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ మాటల్లోనే మీ రాజ ధర్మం ఎక్కడ ఉందంటూ ప్రధానమంత్రిని నేరుగా ప్రశ్నించారు ఏఐసీసీ ప్రెసిడెంట్. 864 రోజులుగా మణిపూర్ అట్టుడికిందన్నారు.
Mallikarjun Kharge Slams PM Modi
300 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అయినా వారి పట్ల కనీసం దయ కూడా చూపించ లేదంటూ మోదీపై ఫైర్ అయ్యారు. , 67,000 మంది నిరాశ్రయులయ్యారు, 1,500 మందికి పైగా గాయపడినా మణిపూర్ వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఈ కాలంలో నరేంద్ర దామోదర దాస్ మోదీ 46 దేశాలలో పర్యటించారని, కానీ మణిపూర్ వైపు కన్నెత్తి చూడ లేదన్నాడు. అంత సమయం లేకుండా గడపడం ఆయనకే చెల్లిందన్నారు. మణిపూర్ ప్రజలు ఏ ఒక్కరు కూడా మోదీని, ఆయన పరివారాన్ని, కేంద్రాన్ని, బీజేపీని, దాని అనుబంధ సంఘాలను క్షమించరని అన్నారు ఖర్గే.
Also Read : AAP Strong Protest IND vs PAK : ఇండియా-పాక్ మ్యాచ్‌పై ఆప్ ఆందోళన

















