Mallikarjun Kharge : ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలు పనిగట్టుకుని ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ఈ ఇద్దరూ దేశానికి ప్రమాదకరంగా మారారని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యమని ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఈ ఇద్దరూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకోవడం లేదన్నారు. గురువారం ఏఐసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యం వారికి లేదని, అంతకు మించి వారికి గౌరవం కూడా లేదన్నారు .
Mallikarjun Kharge Slams Modi, Amit Shah’s Ruling
గుజరాత్‌లోని జునాగఢ్‌కు చేరుకున్న ఖర్గే కీలక వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యంలో పోరాడటం మామూలేనని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, అదే సమయంలో డెమోక్రసీని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ వంటి వ్యక్తులు జన్మించి దేశానికి స్వేచ్ఛ పొందిన భూమి ఇది అన్నారు ఖర్గే. ఈ ఇద్దరూ మనకు అత్యంత గౌరవ ప్రదమైన వారన్నారు. వారి కారణంగా దేశం ఐక్యంగా ఉందని చెప్పారు. అయితే ఇదే సమయంలో రాజ్యాంగం సురక్షితంగా ఉండాలని మరో ఇద్దరు వ్యక్తులు కోరుకోవడం లేదంటూ మండిపడ్డారు మల్లికార్జున్ ఖర్గే.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తరపున వచ్చిన ఓట్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమకు ఉన్న ఓట్లు వచ్చాయని చెప్పారు. ఏది ఏమైనా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తమ పార్టీ అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పై చేసిన ఆరోపణలు దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
Also Read : Mexico Tariffs Shocking : ఆసియా దిగుమతులపై మెక్సికో టారిఫ్స్


















