Mallikarjun Kharge : బెంగళూరు : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేశాడని, తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నాడు. సంచలన విషయాలు బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు . రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని వాపోయాడు. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నట్లు తెలిపాడు. మంత్రుల మధ్య కీచులాటలు, వాటాల పంపకాల లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందన్నారు.
Mallikarjun Kharge Shocking Comments
బిసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయక పోవడం వల్ల మన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యిందన్నాడు. మొదటి నుండి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదన్నాడు. పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదని ఆరోపించాడు. ఇప్పుడు బిసి రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది అనే సంకేతాలు వెళ్తున్నాయన్నాడు. అది పార్టీకి తీవ్ర నష్టం చేసిందన్నాడు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న రెడ్లు, దళితులు ఈ అంశం వల్ల దూరం అయ్యాడని వాపోయాడు. పోనీ బిసిలు అయినా మనకు దగ్గర అయ్యారా అంటే అదీ లేదు. రేవంత్ చేసిన నిర్వాకం వల్ల అన్ని కులాల వాళ్లూ కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారని అన్నాడు ఖర్గే. అనవసరంగా రాహుల్ గాంధీ పేరును లాగాడని ఆరోపించాడు.
Also Read : CM Chandrababu Important Update : శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు సాధ్యం


















