మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాలి

డిమాండ్ చేసిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్

hellotellugu-PVNMadhav

అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే చేసిన కామెంట్స్ ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆదివారం మాధ‌వ్ మీడియాతో మాట్లాడారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని, సభ్య సమాజం వీటిని ఎన్నటికీ అంగీకరించదని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించడం ప‌నిగా పెట్టుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. దేశంలో యుద్ధోన్మాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఒక వర్గాన్ని పూర్తిస్థాయిలో నాశనం చేయాలని, చంపాలని ఖర్గే పిలుపు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు మాధ‌వ్. పాములతో పోలిక – హత్యాకాండకు పిలుపు ఇవ్వ‌డం ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు .

తమ సంస్థ‌లు ఆర్ఎస్ఎస్, బీజేపీల‌ను పాముల‌తో పోల్చ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు బీజేపీ చీఫ్‌. ఆ పాములను ఏ విధంగా చంపుతారో అదే విధంగా వీరిని కూడా చంపాలని పిలుపు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది ఏ ర‌క‌మైన ప్ర‌జాస్వామ్యం అని ప్ర‌శ్నించారు. త‌క్ష‌ణ‌మే ఖ‌ర్గే బ‌హిరంగంగా భార‌త జాతికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు పీవీఎన్ మాధ‌వ్. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే ఈ విషయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తమ స్పందన తెలియజేయాలని డిమాండ్ చేశారు .

ఆర్.ఎస్.ఎస్ , బిజెపి నాయకులను చంపాలనే పిలుపును ముస్లిం సమాజానికి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌. చట్ట పరిధిలో ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు . రాజకీయాల్లో ప్రత్యర్థులను శత్రువులుగా భావించి, వారు చచ్చి పోవాలని కోరుకునే ఆలోచన ఉన్న ఖర్గే, ప్రజాస్వామ్యంలో ఉండటానికి అనర్హుడని ఆయన అన్నారు.

Exit mobile version