Make in India-China Shocking : ప్రత్యేక ఎరువుల ఎగుమతులపై భారత్ పై ఆంక్షలు విధించిన చైనా

యాపిల్‌ ఐఫోన్ల తయారీపై ప్రభావం చూపేలా చర్యలకు తెరతీసింది...

Hello Telugu - Make in India-China Shocking

Hello Telugu - Make in India-China Shocking

China : భారత్‌పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో చైనా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే కీలక రంగాలైన రేర్ ఎర్త్‌ మాగ్నెట్లు, ప్రత్యేక ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన బీజింగ్‌ ప్రభుత్వం, తాజాగా భారత్‌లో (India) యాపిల్‌ ఐఫోన్ల తయారీపై ప్రభావం చూపేలా చర్యలకు తెరతీసింది.

China Shocking

భారతదేశంలో యాపిల్‌కు ఐఫోన్లు తయారు చేసే తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీల నుంచి చైనా (China) ప్రభుత్వానికి చెందిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులను వెనక్కు పిలిపించుకుంటోంది. గడిచిన రెండు నెలల్లో దక్షిణ భారతదేశంలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లలో పనిచేసే సుమారు 300 మంది చైనీస్‌ సిబ్బంది తమ దేశానికి తిరిగిపోయినట్లు సమాచారం.

ఈ పరిణామాలపై పరిశ్రమ వర్గాలు స్పందిస్తూ, ఈ చర్యలు తాత్కాలికంగా భారత ఉత్పత్తులపై ప్రభావం చూపినప్పటికీ, దీర్ఘకాలికంగా మాత్రం వాటి ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నారు.

కోవిడ్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా “చైనా ప్లస్ వన్” వ్యూహం లో భాగంగా అమెరికా, యూరోప్‌, జపాన్‌ వంటి దేశాల కంపెనీలు చైనా మీద ఆధారాన్ని తగ్గిస్తూ భారత్‌, వియత్నాం వంటి దేశాల్లో పెట్టుబడులు పెంచుతున్నాయి.

యాపిల్‌ కంపెనీ ఇప్పటికే తన ఐఫోన్లలో 20 శాతం వరకు భారత్‌లో తయారుచేసిన భాగాలనే వినియోగిస్తోంది. ఈ సంఖ్యను వచ్చే ఏడాదికి మరింతగా పెంచనున్నట్టు ప్రకటించింది. దీంతో గ్లోబల్‌ తయారీ కేంద్రంగా తన స్థానాన్ని కోల్పోతుందన్న భయంతో చైనా స్పందిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇక చైనా వైఖరికి ఒక కారణం గల్వాన్‌ లోయలో జరిగిన సరిహద్దు ఘర్షణలు కావచ్చు. ఆ ఘటన తర్వాత భారత ప్రభుత్వం చైనా కంపెనీలపై పలు ఆంక్షలు విధించింది. ముఖ్యంగా టెలికం రంగంలో 4జీ, 5జీ నెట్‌వర్క్‌ విస్తరణల్లో చైనా కంపెనీలకు అవకాశం ఇవ్వలేదు.

దీంతో మన దేశంతో వ్యాపార, సాంకేతిక సంబంధాలను కుదించాలనే ఉద్దేశంతో చైనా ఇప్పుడు సాంకేతిక సిబ్బంది వలసపై ఆంక్షలు, నియంత్రణలు పెంచుతోందన్న భావన బలపడుతోంది.

తాత్కాలికంగా ఇది కొన్ని రంగాలకు ఇబ్బందిగా మారినా, భారత్‌ తన స్వతంత్ర తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగనుందని నిపుణుల అభిప్రాయం.

Also Read : Today Gold and Silver Price : రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు

Exit mobile version