హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రజా ప్రభుత్వం కొత్త భూ భారతి లో కీలక మార్పులు చేసినట్లు తెలిపారు. భూమికి సంబంధించిన అన్ని సేవలు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. పౌరులు, ముఖ్యంగా రైతులు, పేదలు బహుళ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ పోర్టల్ ద్వారా తొలగి పోతుందని మంత్రి అన్నారు. ఐదు మండలాల్లో 45 రోజుల పైలట్ దశ తర్వాత, అవసరమైన మార్పులతో కొత్త సమీకృత భూ భారతి (ఐ-భూ భారతి) పోర్టల్‌ను ప్రతి జిల్లాలోని ఒక మండలానికి విస్తరిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం విట్టపల్లెలోని ఒక గ్రామసభలో ఈ పోర్టల్‌ను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వరావుపేట, సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి, నారాయణపేట జిల్లాలోని కోస్గి సహా ఎంపిక చేసిన ఐదు మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా భూమికి సంబంధించిన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీని కారణంగా ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండబోదని, ఇది టెక్నాలజీ పరంగా కీలక మార్పు అని పేర్కొన్నారు.
రెండవ దశలో భాగంగా ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ఒక ప్రత్యేకమైన భూదార్ నంబర్‌ను కేటాయిస్తామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు..
















