Mahesh Kumar Goud : హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో పై విధంగా స్పందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా తమ సర్కార్ పై రోజు రోజుకు జనం ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రతి వర్గానికి లబ్ది చేకూరిందన్నారు టీపీసీసీ చీఫ్. ఇప్పటికే గ్రామ, పట్టణ స్థాయిలో తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్నారు . తమ దరిదాపుల్లోకి ఏ ఒక్క పార్టీ రానే రాదన్నారు.
TPCC Chief Mahesh Kumar Goud Challenge
ఇదిలా ఉండగా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు పూర్తి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి టార్గెట్ కేటాయించామన్నారు. ఎప్పటికప్పుడు నిర్దేశించిన సంఖ్యను చేరుకునేలా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించడం జరిగిందన్నారు. సంస్థాగత పనులను పర్యవేక్షించడానికి నవంబర్ 11 వరకు వారి జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించామన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఇప్పటికే విస్తృతమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులకు మద్దతు కోరుతూ అక్టోబర్ 10 నుండి అన్ని గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు.
Also Read : Telangana Tops in Crimes Sensational : మహిళలపై నేరాల్లో తెలంగాణ టాప్

















