Hero Mahesh Babu : మ‌హేష్ బాబు మూవీ పేరు గ్లోబ్ ట్రోట‌ర్..?

ప్రిన్స్ పుట్టిన రోజు షేర్ చేసిన రాజ‌మౌళి

Hello Telugu - Hero Mahesh Babu

Hello Telugu - Hero Mahesh Babu

Mahesh Babu : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. ఇందులో మ‌హేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ త‌ర్వాత వ‌స్తున్న మూవీ ఇది. దీంతో భారీ ఎత్తున ఉత్కంఠ నెల‌కొంది. త‌ను ఎక్కువ కాలం స‌మ‌యం తీసుకుంటాడు. ఇక త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌లీల‌తో క‌లిసి న‌టించాడు మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీలో. ఇదే త‌న ఆఖ‌రి సినిమా. ప్ర‌స్తుతం హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు ద‌ర్శ‌క ధీరుడు. ప‌లు చోట్ల షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు రాజ‌మౌళి.

Mahesh Babu Movie New Look

ఇదిలా ఉండ‌గా ప్రిన్స్ మ‌హేష్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజు ఆగ‌స్టు 9. శ‌నివారం రోజు ఆయ‌న అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పాడు ద‌ర్శ‌క ధీరుడు. గ్లోబ్ ట్రోట‌ర్ అని పేరు పెట్టాడు. ఆ సినిమా టైటిల్ ఇదే అయి ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా భారీ బ‌డ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. యాక్ష‌న్ అడ్వెంచర్ మూవీ నవంబర్ 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇదిలా ఉండ‌గా తన పుట్టిన రోజు సందర్భంగా తనపై కురిపిస్తున్న ప్రేమకు అందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పేరు ‘గ్లోబ్ ట్రోటర్’ అని పెట్టారా అనే ఊహాగానాలకు ఇప్పుడు సోషల్ మీడియాలో తెర లేపారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి SSMB29 అని తాత్కాలికంగా పిలుస్తున్న ఈ సినిమా గురించి ఒక ప్రధాన అప్‌డేట్‌ను విడుదల చేయడంతో ఇదంతా ప్రారంభమైంది.

Also Read : NTPC Huge Investment : తెలంగాణలో 80 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్టీపీసీ

Exit mobile version