Popular Maha Yagam Grand Conclusion : ముగిసిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహా యాగం

దేశ వ్యాప్తంగా యాగాలు నిర్వ‌హిస్తామన్న ఈవో

Hello Telugu - Popular Maha Yagam Grand Conclusion

Hello Telugu - Popular Maha Yagam Grand Conclusion

Maha Yagam : తిరుమల – భక్తుల ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం (Maha Yagam) పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది.మొత్తం 32 మంది వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ మహా యాగంలో వేద పారాయణం, సుందరకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరిగాయి.

Maha Yagam Updates

ఈ యాగానికి హాజరయ్యారు టీటీడీ ఈవో జె.శ్యామలరావు . యాగం అనంత‌రం మీడియాతో మాట్లాడారు.
సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం వైభవంగా ముగిసిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వశాంతి యాగాలు, హవనాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని అన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలియజేశారు.

ఈ మహా యాగంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు ఈవో శ్యామ‌ల రావు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామి వారి పుష్కరిణి మరమ్మ‌తు పనులు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణి భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చిందని చెప్పారు.

కాగా ఆగ‌స్టు 20 నుండి భ‌క్తుల‌ను పుష్క‌రిణీలో స్నానం చేసేందుకు అనుమ‌తించారు. ఇదిలా ఉండ‌గా పుష్క‌రిణి అందుబాటులోకి రావ‌డం ప‌ట్ల శ్రీ‌వారి భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే సెప్టంబ‌ర్ 24 నుంచి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగనున్నాయి. ఈ మేర‌కు టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : TTD Popular Brahmotvams : శ్రీవారి భక్తుల కోసం స్వామి పుష్కరిణి సిద్దం

Exit mobile version