Little Hearts Movie OTT Interesting Update : రేపే లిటిల్ హార్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్

సినీ ప్రేక్ష‌కుల‌కు ఖుష్ క‌బ‌ర్

Hello Telugu - Little Hearts Movie OTT Interesting Update

Hello Telugu - Little Hearts Movie OTT Interesting Update

Little Hearts : హైద‌రాబాద్ : ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అద్భుత‌మైన టాక్ తో దూసుకు పోయింది లిటిల్ హర్ట్స్ మూవీ. ఇది ఏకంగా రూ. 40 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ చేసింద‌ని సినీ వ‌ర్గాల‌లో టాక్. అద్భుత‌మైన కంటెంట్ , న‌టీ న‌టుల సూప‌ర్ న‌ట‌న కూడా ప్ల‌స్ పాయింట్ గా నిలిచింది. దీంతో కాసుల వ‌ర్షం కురిసేలా చేసింది. దీనిని ఈటీవీ యాజ‌మాన్యం నిర్మించింది. ఈమేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. లిటిల్ హార్ట్స్ (Little Hearts) మూవీని ఓటీటీలో అక్టోబ‌ర్ 1న స్ట్రీమింగ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మౌళి తనూజ్ ఇటీవల విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ విజయంలో మునిగి పోయాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సులు పూర్తిగా కాసుల‌తో నిండి పోయాయి.

Little Hearts Movie OTT Updates

ఇక టేకింగ్ మేకింగ్ లో దుమ్ము రేపాడు సాయి మార్తాండ్. త‌ను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు లిటిల్ హార్ట్స్ . ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది . అక్టోబర్ 1 న స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ద‌మైంది. ఈ విష‌యాన్ని ఈటీవీ విన్ వెల్లడించింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇంటిల్లిపాది క‌లిసి చూసేలా లిటిల్ హార్ట్స్ ను రూపొందించాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తి ఒక్క‌రిని ఆనంద‌ప‌డేలా చేస్తుంద‌ని తెలిపింది ఓటీటీ సంస్థ‌. ఇక పొడిగించిన వెర్ష‌న్ లో ప్ర‌త్యేకంగా కొన్ని స‌న్నివేశాల‌ను కూడా జోడించ‌డం జ‌రిగింద‌ని పేర్కొంది. అంతే కాకుండా ఈటీవీ విన్ బ్యాన‌ర్ కింద ఆదిత్య హ‌స‌న్ మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జై కృష్ణ, అనితా చౌదరి, ఎస్ఎస్ కాంచి , సత్య కృష్ణన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Movie Piracy Sensational : పైర‌సీ భూతం దేశ వ్యాప్తంగా రూ. 22,400 కోట్లు న‌ష్టం

Exit mobile version