Vizag : విశాఖపట్నం : విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్బివేశారు. విశాఖలో (Vizag) అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Vizag Heavy Rains – East India Company
ఇక ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిన్ననే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ముందస్తుగా హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని, దీని కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఐఎండీ హెచ్చరించినట్లుగానే ఏపీలో పలు చోట్ల ఎడతెగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లి పోయాయి. పోర్టు సమీపంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్ లో పిడుగు పాటు కారణంగా పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మరో వైపు విజయనగరం జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. వేపాడ మండలంలోని కొండగంగుపూడి గ్రామంలో పిడుగులు పడి కనీసం 30 గొర్రెలు చనిపోయాయి. ఎస్. కోట మండలంలోని మునుపురైలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. తెలంగాణలోని వరంగల్ పట్టణంలో భారీ వర్షాలు కురిశాయి, సాధారణ జన జీవనం స్తంభించింది.
Also Read : PM Modi Important – Bhupen Hazarika : భూపేన్ హజారికా శతజయంతుత్సవాలు
















