Lalit Modi : లండన్‌లో ఇటీవల జరిగిన ఓ ప్రత్యేక పార్టీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వేడుకను ఐపీఎల్‌కు పూర్వ కమిషనర్‌గా పనిచేసిన లలిత్ మోదీ స్వయంగా నిర్వహించారు. ఆయన ఆహ్వానంతో వచ్చిన అతిథుల్లో లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి స్టేజ్‌పై పాటలు పాడుతూ స్టెప్పులు వేయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
Lalit Modi and Vijay Mallya Video Viral
ఈ పార్టీకి 300 మందికిపైగా హాజరయ్యారు. లలిత్ మోదీ (Lalit Modi), విజయ్ మాల్యా కలిసి “ఐ డిడ్ ఇట్ మై వే” అనే పాటను ఆలపిస్తూ సందడి చేశారు. వారితో పాటు పలువురు అతిథులు కూడా నృత్యంలో పాల్గొన్నారు. అనంతరం వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆయన తన సంతకంతో కూడిన క్రికెట్ బ్యాట్‌ను లలిత్ మోదీకి అందజేశారు.
ఈ వీడియోలను లలిత్ మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, “ఇది వివాదాస్పదమవుతుందన్నా నేను అదే చేసాను” అంటూ వ్యాఖ్యానించారు. క్రిస్ గేల్ కూడా ఈ ఫొటోలను తన ఖాతాలో షేర్ చేశారు.
దేశానికి వేల కోట్లు బకాయి ఉండి విదేశాలకు పారిపోయిన ఈ ఇద్దరు వ్యక్తులు పార్టీ చేసుకుంటుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. నెట్టింట ఈ దృశ్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, తిరిగి వీరిని ఇండియాకు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Monsoon Danger Foods : వర్షాకాలంలో ఇవి తిన్నారంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే



















