Nepal : నేపాల్ : ఉన్నట్టుండి నేపాల్ రాజకీయ తెరపై కొత్త పేరు వచ్చింది. ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా కొలువు తీరారు కుల్మాన్ ఘిసింగ్. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. నిరసనలు, ఆందోళనల కారణంగా 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆపై భారీ భద్రత మధ్య దుబాయ్ కి పారి పోయాడు తన కుటుంబంతో సహా. తాజాగా కొలువు తీరిన కుల్మాన్ ఘిసింగ్ కు ప్రత్యేకత ఉంది. ఘిసింగ్ ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ఇళ్లను చీకటిమయం చేసిన దీర్ఘకాలిక భారం-తగ్గింపు సంక్షోభాన్ని అంతం చేయడంలో ప్రసిద్ధి చెందారు. 1970 నవంబర్‌లో రామెచ్చాప్ జిల్లాలోని బెథాన్ గ్రామంలో పుట్టాడు.
Nepal New PM Kulman Ghisingh
నేపాల్‌లో (Nepal) పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులకు వెళ్లే ముందు భారతదేశంలో స్కాలర్‌షిప్‌పై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. ఘిసింగ్ తన కెరీర్ ప్రారంభంలోనే నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో చేరారు. తను సాంకేతిక నైపుణ్యంలో నేర్పరిగా గుర్తింపు పొందారు. అంకితభావం కారణంగా ర్యాంకుల ద్వారా ఎదిగారు. 2016లో కుల్మాన్ ఘిసింగ్ ఎన్ ఎఫ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు . దేశ వ్యాప్తంగా ఒకప్పుడు రోజుకు 18 గంటల వరకు ఉండే విద్యుత్ అంతరాయాలను కొన్ని గంటలకు తగ్గించారు . చాలా ప్రాంతాలలో చీకటి అనేది లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు ఘిసింగ్. నేపాల్ లైట్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది తను చేసిన పనికి. ప్రజా నాయకుడిగా పేరొందారు.
Also Read : Minister Parthasarathy-Super Six Success : అనంతపురంలో సభ సూపర్ సక్సెస్ : పార్థసారథి

















