KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై స్పందించారు. తమ పార్టీ అభ్యర్థి ఓటమి చెందడానికి గల కారణాలను విశ్లేషించు కుంటామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందనే దానిపై విశ్లేషించు కుంటామని తెలిపారు కేటీఆర్. ఈ ఎన్నిక ద్వారా మరోసారి ప్రజలు తీర్పు చెప్పారని, కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని తేల్చారని అన్నారు. తాము నిర్ణయాత్మకమైన పాత్ర ఎప్పటి లాగే పోషిస్తామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని ప్రకటించారు. ఊరికే ఉండే ప్రసక్తి లేదన్నారు. తాము లేవదీసిన అంశాలకు సంబంధించి సర్కార్ లో చలనం వచ్చిందన్నారు కేటీఆర్.
KTR Key Comments
ఎన్నికల ఫలితంపై బిఆర్ఎస్ పూర్తిగా స్వీయ-పునరాలోచన చేసుకుంటుందని అన్నారు. పోలింగ్ రోజున అధిక ఓటర్లు నమోదు కాలేదని, ఇది కూడా ఓటమికి కారణమన్నారు. అధికార పార్టీ, ఎన్నికల కమిషన్ , పోలీసులు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారని ఆరోపించారు. తాము దొంగ ఓట్లకు సంబంధించి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించు కోలేదని వాపోయారు. అయినా గట్టి పోటీ ఇవ్వగలిగామని చెప్పారు. ఈ ఎన్నికల్లో చీకటి బంధం బయట పడిందన్నారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ తమను ఓడించేందుకు ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఫలితంతో తాము నిరాశ చెందలేదని, మున్ముందు మరింత పోరాడేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : Minister Ponnam Prabhakar Clear Instructions : పల్లె పల్లెనా సంబురాలు నిర్వహించండి
















