KTR : హైదరాబాద్ : ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). వరంగల్, హన్మకొండ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించారు. ఈనెల 29వ తేదీన దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు పార్టీ శ్రేణులకు. ఈ సందర్బంగా దిశా నిర్దేశం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 అని గుర్తు చేశారు. ఆరోజు కేసీఆర్ ను ఖమ్మం జిల్లాకు తరలించిన రోజు నా మనసులో ఇంకా తిరుగుతూనే ఉందని అన్నారు. కేయూ దగ్గర విద్యార్థుల రాస్తారోకోలో నేనూ పాల్గొన్నానని చెప్పారు కేటీఆర్.
KTR Key Comments on Deeksha Divas
ఆనాడు మమ్మల్ని వరంగల్ సెంట్రల్ జైలులో పెట్టారని తెలిపారు. 30 గంటల తర్వాత నన్ను విడుదల చేస్తే ఖమ్మం వెళ్ళానని తెలిపారు. యుద్ధ భూమిని తలపించే విధంగా తెలంగాణ కదిలిందని అన్నారు.
శ్రీకాంతా చారి మరణంతో మలి దశ ఉద్యమం జరిగిందని, ఈతరం పిల్లలకు దీక్షా దివస్ గురించి తెలియదన్నారు. తెలంగాణను రాచి రంపాన పెడుతున్న అంశాలను గుర్తు చేసుకుని పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్దామన్నారు. ప్రతి ఏటా 11 రోజుల పాటు వినయ్ భాస్కర్ కార్యక్రమాలు చేస్తారని స్పష్టం చేశారు కేటీఆర్. ఏ దీక్షతో తెలంగాణ మలుపు తిరిగిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. అధి నాయకుడు కేసీఆర్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Also Read : Hydraa AV Ranganath Shocking Comments : చెరువుల పునరుద్ధరణ అద్భుతం : కర్ణాటక బృందం

















