KTR : హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి తెర లేపిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ శ్రేణుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. తనకు భరోసా ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ కార్యకర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని అన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడడం దారుణమన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.
KTR Slams Congress
తాము పదేళ్లు అధికారంలో ఉన్నామని, చాలా ఉప ఎన్నికల్లో గెలిచామని కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలా దాడులు చేయ లేదని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రకటించారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.దొంగ ఓట్లు వేసి, గూండాగిరి చేసి, డబ్బులు పంచి కాంగ్రెస్ గెలిచిందని ధ్వజమెత్తారు కేటీఆర్ . ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పార్టీ గుర్తును గాడిదపై ఎక్కించి ఊరేగింపు చేశామా అంటూ ప్రశ్నించారు. ఇకనైనా దాడులు ఆపాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Minister Atchannaidu Interesting Comments : న్యాచురల్ ఫార్మింగ్‌లో ఏపీకి ప్రపంచ గుర్తింపు


















