KTR : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని అందుకే దీనిపై విచారణ చేపట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). రాహుల్ గాంధీ సీబీఐని ప్రతిపక్షాల నిర్మూలన సెల్‌గా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అంటూ విమర్శలు గుప్పించారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా తాము న్యాయ పరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత గొప్ప ప్రాజెక్టు కట్టలేదని ప్రచారం జరుగుతుంటే సీఎం ఏకపక్షంగా సీబీఐకి అప్పగిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
KTR Slams CM Revanth Reddy
శాసన సభలో ఇందుకు సంబంధించి సీరియస్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఒక న్యాయం రేవంత్ కు మరో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వాస్తవాలు ఏమిటో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని అన్నారు. త్వరలోనే అవి కూడా బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాళేశ్వరం పై ఎలా బురద చల్లారో, ఎలాంటి దుష్ప్రచారం చేశారో కళ్లకు కట్టినట్లు ఇవాళ బహిర్గతమైందన్నారు. అయినా తెలంగాణ కోసం పోరాడిన వాళ్లం, జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లం ఇలాంటి బెదిరింపులకు భయపేడిది లేదన్నారు కేటీఆర్.
Also Read : Deputy CM Pawan – Pithapuram Growth : రూ. 400 కోట్లతో పిఠాపురం అభివృద్ది : పవన్ కళ్యాణ్















