KTR : హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్ పాలనపై భగ్గుమన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి రోడ్ షో చేపట్టారు. ఈసందర్బంగా కార్నర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 14 తర్వాత రాష్ట్రంలో తుఫాను రాబోతోందని జోష్యం చెప్పారు. నేరమయ చరిత్ర కలిగిన సీఎం అండ చూసుకుని ఎవరెవరు ఎగురుతున్నారో వాళ్ల తోకలు కత్తరిస్తామని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ (KTR). ఆకు రౌడీలను రేవంత్ రెడ్డి కూడా కాపాడ లేడని అన్నారు. గత 2 ఏళ్ల పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR Slams CM Revanth Reddy
గతంలో తనకు ప్రతి రోజూ రూ. 2 వేలు వస్తుందని ఆటో డ్రైవర్ మహమూద్ చెప్పాడని , కానీ ఇప్పుడు కనీసం రూ. 200 కూడా రావడం లేదని వాపోయాడన్నారు. తనలాంటి పరిస్థితిని నగరంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు కేటీఆర్. ఇలా అయితే ఎలా బతకాలని వారంతా ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఒక్కసారి ఓటేస్తే ఐదుళ్లు శిక్ష అనుభవించాల్సిందేనా అని ప్రశ్నించారు. దీనికి ఒక్కటే పరిష్కారం ఉందని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లేకపోతే అరాచకం తారా స్థాయికి చేరుకుంటుందన్నారు కేటీఆర్.
Also Read : DY CM Pawan Shocking Comments : ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం


















