హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకు సంబంధించిన కేసులో ఒకరికి ఒక లాగా మరొకరికి ఇంకోలాగా ట్రీట్ చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు కేటీఆర్.
స్వయంగా కేసీఆర్ తాను ఉంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పైశాచిక ఆనందం తప్పితే మరోటి కాదన్నారు కేటీఆర్. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులని ఆరోపించారు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా అంటూ ఫైర్ అయ్యారు.
చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు కేటీఆర్. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామంటూ సీఎంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.
