KTR : హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం మెడికల్ డివైసెస్ పార్క్ అని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). శుక్రవారం హైదరాబాద్ లో హ్యూవెల్ సంస్థ నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం జరగిన సమావేశంలో ప్రసంగించారు కేటీఆర్. తెలంగాణలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాంత బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి, హ్యూవెల్ కంపెనీ ఎండీ, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. మన దేశంలో 70 నుంచి 80% మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అన్నారు. అట్లా ఎందుకు ఉండాలి? మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు అనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కేటీఆర్.
KTR Praises KCR
మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి సామాన్యుడికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. పార్క్ ఏర్పాటుకు ముందు సుల్తాన్‌పూర్ ఏరియాలో స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, కొంత ఖాళీ జాగా తప్ప ఏమీ లేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వేల మంది పని చేస్తుండటం, అనేక పరిశ్రమలు రావడం చూసి చాలా సంతోషం అనిపించిందని చెప్పారు కేటీఆర్. ఇక్కడ జరిగిన పరిశోధనలు, ప్రవేశపెట్టిన ఉత్పత్తులు చూస్తే తనకు విశ్వాసం కలిగిందని అన్నారు. కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లకు, కోవిడ్ కిట్స్‌కు విపరీతమైన గిరాకీ, డిమాండ్ ఉండేదని, ఆ రోజుల్లో టెస్ట్ కిట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
Also Read : BC Union Leaders Important Meet – DY CM Bhatti : డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన బీసీ నేతలు
















