KTR : ఆదిలాబాద్ జిల్లా : పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కిరంచడంలో రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో పత్తి, సోయా రైతులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు . కనీస మద్దతు ధర కూడా కల్పించడం లేదని వాపోయారు బాధిత రైతులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించు కోవడం లేదన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతన్నలకు ఇచ్చిన హామీలన్నింటిని పక్కన పెట్టిందని ఆరోపించారు. కనీసం పండిన పంటలను అమ్ము కోవడంలో కూడా సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR Slams Telangana Govt
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటే ఎందుకు ఈ రోజు అదిలాబాద్ మార్కెట్ యార్డ్ ని బంద్ పెట్టారని ప్రశ్నించారు కేటీఆర్. రైతన్నలను కలుస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు కల్పించిందని నిలదీశారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా పత్తి, సోయా రైతుల పరిస్థితి మారిందని వాపోయారు. కిసాన్ కపాస్ మొబైల్ అప్లికేషన్ అని తీసుకువచ్చి దాని ద్వారానే పంటలు కొంటాం అంటున్నారు. మరి కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటి? ఆదిలాబాద్ లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ అన్నిచోట్ల ఉండదు, మరి ఇలాంటి సందర్భంలో రైతన్నల పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో భారీగా అకాల వర్షాలు పడినందువల్ల పత్తి తేమ శాతం ఎక్కువగా ఉందన్నారు.
Also Read : IBomma Ravi Shocking Comments : భార్య, అత్త టార్చర్ భరించ లేక ఇలా చేశా : ఇమ్మడి రవి


















