KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగున్నర కోట్ల మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారని అన్నారు. కేటీఆర్ ఓ ఛానల్ తో చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని మాటలను బయట పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని మోసపూరితమైన హామీలు గుప్పించినా, రౌడీ రాజకీయం చేసినా వర్కవుట్ కాదన్నారు. ప్రజలు ఆల్ రెడీ డిసైడ్ అయ్యారని, గులాబీకే పట్టం కట్టాలని నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే తాము దొంగ ఓట్ల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. దీని కారణంగా కేసులు కూడా నమోదైనట్లు తెలిపారు.
KTR Gives Key Update
జూబ్లీ హిల్స్ లో పక్కా గెలిచేది తమ పార్టీ అభ్యర్థి అని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని అన్నారు. కేవలం తాము మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై మాత్రమే ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు కేటీఆర్. ప్రజలను ఒక్కసారి మోసం చేస్తే భరిస్తారు, రెండోసారి తీసుకుంటే మౌనంగా ఉంటారు..ఇక మూడోసారి కూడా మాయ మాటలతో దగాకు పాల్పడతామంటే ఊరుకోరని పేర్కొన్నారు . బీఆర్ఎస్ విజయం అనివార్యమని అన్నారు మాజీ మంత్రి. ఓటమి భయంతో ప్రజలను, ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read : DY CM Pawan Kalyan Important Update : ఆలయాల్లో భక్తుల భద్రతపై దృష్టి సారించాలి


















