KTR : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకమే యాదాద్రి పవర్ ప్లాంట్ అని పేర్కొన్నారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ జాతికి అంకితమం కావడం సంతోషమని పేర్కొన్నారు.
KTR Key Comments
కేసీఆర్ దార్శనికతకు, దృఢ సంకల్పానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కరెంట్ కష్టాలతో విలవిల్లాడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకట్లు తప్పవని నాటి పాలకులు భయపెట్టారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ విప్లవాత్మక చర్యలతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయని తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్.. ఆనాడు కేసీఆర్ కి ఉన్న ముందుచూపు, పట్టుదలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఇవాళ ఈ ప్లాంట్ వెలుగులు పంచుతూ తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వనుందన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు అని, స్వతంత్య్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదేనని స్పష్టం చేశారు కేటీఆర్.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం BHELకు అప్పగించిందన్నారు. దాదాపు రూ.20,400 కోట్లు విలువైన అర్డర్ అని పేర్కొన్నారు. భారత విద్యుత్ రంగ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చిన అత్యంత విలువైన ఆర్డర్‌గా నిలిచిందన్నారు.
Also Read : MP Gurumoorthy Strong Demand : ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి
















