KTR : హైదరాబాద్ : భారతదేశంలో తెల్లకోటు విప్లవాన్ని తీసుకు వచ్చింది తెలంగాణ అంటే అది కేసీఆర్ గారి చొరవ వల్లనే సాధ్యమైందన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. జహీరాబాద్‌లోని గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులతో ఆదివారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు. ఈ సందర్బంగా విద్యార్థులను సన్మానించారు. అనంతరం కేటీఆర్ (KTR) ప్రసంగించారు. రాష్ట్రంలో 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దేనని పేర్కొన్నారు. ఒక గురుకుల స్కూల్ నుంచి 16 మంది మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారని , ఆనందంగా ఉందన్నారు.
KTR Praises KCR
ఈరోజు వేలమంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు ఇతర అనేక వృత్తుల్లోకి విజయవంతంగా ప్రవేశించారు అంటే అది కేసీఆర్ దార్శనికత వల్లనేనని అన్నారు కేటీఆర్. 2014లో కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు 34 మెడికల్ కాలేజీలు అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అనేక రంగాల్లో దిక్సూచిగా నిలుస్తోందని చెప్పారు కేటీఆర్.మంచి విద్యా అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్క పేద తల్లి దండ్రి తమ బిడ్డలకు విద్య అందించేందుకు సంసిద్ధంగా ఉంటారని కేసీఆర్ ఆనాడు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆ తల్లిదండ్రుల కల నెరవేర్చే విధంగా, ఒక ఆటో డ్రైవర్ కుమార్తె, ఒక జర్నలిస్టు కుమార్తె, ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కుమార్తె ‘మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నాని’ అని చెప్తుంటే సంతోషంగా ఉందన్నారు.
Also Read : Telangana Govt Shocking Checks : తెలంగాణలో విస్తృతంగా బస్సుల తనిఖీలు

















