KTR : హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు జూలై 24 గురువారం. ఈ సందర్బంగా తన పేరెంట్స్ మాజీ సీఎం కేసీఆర్ , తల్లి శోభకు కాళ్లు మొక్కారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయురారోగ్యాలతో కలకలం చల్లంగా బతకాలని కేటీఆర్ (KTR) ను ఆశీర్వదించారు. భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ తనకే ఉందని తండ్రి నమ్మకం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత చదువు చదివారు.
KTR Birthday – Wishes KCR
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన నెంబర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు. పలు భాషలపై మంచి పట్టుంది. ప్రత్యేకించి తెలంగాణకు ఐటీ కంపెనీలను తీసుకు రావడంలో, రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చడంలో ముఖ్య భూమిక పోషించారు. మంచి వాగ్ధాటి కలిగి ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందారు. ఏ అంశమైనా సరే అనర్ఘలంగా ప్రసంగించడంలో తనకు తనే సాటి.
ప్రస్తుతం తండ్రి బీఆర్ఎస్ కు ప్రెసిడెంట్ గా ఉండగా తను వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు మోస్తున్నారు. పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓ వైపు చెల్లెలు కల్వకుంట్ల కవిత ఎమ్మల్సీ కాగా, బావ తన్నీరు హరీశ్ రావు మాజీ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం తను ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ హవాలో ఈ ఇద్దరు తట్టుకుని గెలిచారు. తను ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేటీఆర్. జీవిత భాగస్వామి నీలిమ. తనకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఆయనకు కార్పొరేట్ కంపెనీలతో మంచి సత్ సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ ఐటీ అంటేనే కేటీఆర్ అంటారు. ఆ మేరకు తను సత్తా చాటారు.
Also Read : AP Cabinet Approved : ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి ఆమోదం
















