KTR : హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 ‘లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు చెన్నై లోని ఐటీసీ గ్రాండ్ చోళాలో ఈనెల 25న మంగళవారం జరగనుంది. ఈ సదస్సులో దక్షిణ భారతదేశ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. వేదికపై జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొని దక్షిణ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక పరిణామాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ మూడవ ఎడిషన్ ఈసారి “భవిష్యత్తుకు సిద్ధం: ఆవిష్కరణ, పరివర్తన, స్ఫూర్తి” (Ready for the Future: Innovation, Transformation, Inspiration) అనే ఇతివృత్తంతో జరగనుంది.
KTR Gets great Recognization From Southern Raising Summit
ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, విద్య, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలలో దక్షిణ రాష్ట్రాలు ఈ విధంగా ముందుకు సాగుతున్నాయో అంశంపై చర్చించడానికి ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమలు, పౌర సమాజానికి చెందిన ప్రముఖులను ఈ సదస్సు ఒకే వేదిక పైకి తీసుకు రానుంది. ఏబీపీ నెట్‌వర్క్ తమ ఆహ్వానంలో కేటీఆర్ (KTR) వంటి నాయకులు పాల్గొనడం కేవలం తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి దిశను నిర్దేశించడంలో దోహద పడుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తెలంగాణ సాధించిన ప్రగతి, భారతదేశ వృద్ధిలో దక్షిణ రాష్ట్రాల పాత్ర, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆవిష్కరణల ఆధారిత రంగాలలో వస్తున్న కొత్త అవకాశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
Also Read : Minister Komatireddy Fired on KCR : కాంగ్రెస్ దెబ్బకు కేసీఆర్ ఖేల్ ఖతం
















