KS Viswanathan : విజయవాడ : రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడేషన్లు ఇస్తామని సమాచార శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ (KS Viswanathan) హామీ ఇచ్చారు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమాచార శాఖ కమిషనర్ కేఎస్ విశ్వనాధాన్ని ప్రతినిధుల బృందం కలిసి జర్నలిస్టుల సమస్యలు ఏకరువు పెట్టారు. కొత్త అక్రిడేషన్ల అంశాలను సుదీర్ఘంగా సంచాలకులతో చర్చించారు ఏపీయూడబ్ల్యూజే (APUWJ) అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, ఉపాధ్యక్షులు చావా రవిల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం సమాచార శాఖ సంచాలకులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
KS Viswanathan Interesting Update
రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, దీనికి ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కమిటీ, వెల్ఫేర్ ఫండ్ కమిటీ వంటి వివిధ జర్నలిస్ట్ ప్రొఫెషనల్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు . వాటిల్లో గతంలో మాదిరిగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను, ఆయా కమిటీల్లో నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఏపీలో స్థాపిచిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
పాత్రికేయులు, యాజమాన్యాల భాగస్వామ్యంతో పత్రికలకు మీడియా సంస్థలకు ప్రభుత్వం జారీ చేసే ప్రకటన బిల్లుల నుండి ఐదు శాతం మినహాయించి జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కు జమచేసి బలోపేతం చేయాలని కోరారు.
Also Read : Dr SRK Dixit Gets Great Award : ఆర్థోపెడిక్స్ డాక్టర్ ఎస్ఆర్కే దీక్షిత్ కు అవార్డు


















