Godavari River : అమరావతి : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. పోటెత్తుతున్న వరదలు కృష్ణా, గోదావరి జలాలకు (Godavari River) ముంచెత్తాయి. ప్రస్తుతం వరద ప్రవాహం స్థిరంగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ స్తాయి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది . ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీ వద్ద 6.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో , అవుట్‌ఫ్లోతో కృష్ణా , గోదావరి నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ఉదయం 6.45 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద 6.86 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని తెలిపారు.
Krishna-Godavari Rivers Level
మరో వైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం 44.4 అడుగులకు చేరుకుందని, తూర్పు గోదావరి జిల్లాలోని ధౌళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో , అవుట్‌ఫ్లో 9.8 లక్షల క్యూసెక్కులకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద మొదటి లెవల్ హెచ్చరికను ఉప సంహరించుకున్నట్లు జైన్ వెల్లడించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు ప్రఖర్ జైన్. ఇదే సమయంలో ఏపీ సర్కార్ ను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. భారీ వర్షాలపై సమీక్ష చేపట్టారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత . ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read : TTD Garuda Vahana Seva Interesting : కమనీయం కళా రూపాల సమ్మేళనం

















