క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’

ఫుల్ లెంగ్త్ కామెడీ పంట పండించిన ద‌ర్శ‌కుడు

hellotelugu-KoreanKamaraj

హైద‌రాబాద్ : వ‌రుణ్ తేజ్ కీ రోల్ పోషించిన కొరియ‌న్ కన‌క‌రాజు విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతోంది. భారీ ఎత్తున కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ద‌ర్శ‌కుడు న‌వ్వులు పూయించాడు. దీనికి తోడు వ‌రుణ్ న‌ట‌న కూడా ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో అంద‌రూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచి లేపుతోంది. థియేటర్ లో ప్రేక్షకులు పడీపడీ నవ్వుతున్నారు. నో లాజిక్. ఓన్లీ లాఫింగ్ మాత్ర‌మే ఉండేలా ద‌ర్శ‌కుడు తీయ‌డంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. అంతే కాకుండా ఈ సినిమా లో కమిడియన్ సత్యా ది వన్ మాన్ షో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

స్క్రీన్ మీద అతను కనిపిస్తే చాలు పగలబడి నవ్వేస్తున్నారు ప్రేక్ష‌క మ‌హాశ‌యులు. ఎఫ్ 2, ఎఫ్ -3 త‌ర్వాత భారీ ఎత్తున న‌వ్వులు పూయిస్తోంది కొరియ‌న్ కన‌క‌రాజు. అతని ఎంట్రీకే మాస్ హీరోకి వేసినట్టు విజల్స్ వేస్తుండ‌డం విశేషం. ఇక‌ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి పెద్ద రిలీఫ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు ఈ మూవీ. గ‌తంలో త‌ను న‌టించిన మూవీస్ అంత‌గా ఆడ‌లేదు. వరుస డిజాస్టర్ల తో ఏకంగా కెరీర్ నే రిస్క్ లో పెట్టుకున్న ఈ మెగాహీరో కి కొరియన్ కనకరాజు రూపంలో మంచి విజయం ఖాతాలో చేరింది. ఇంకా మూడు రోజులే అయ్యింది విడుద‌లై ఈ మూవీ. అయితే మొదటి రోజు పది కోట్ల దాకా గ్రాస్ సాధించడం, రెండో రోజు బుకింగ్స్ ప్రామిసింగ్ గా ఉండటం, గంటకు పదివేలకు పైగా టికెట్లు అమ్ముడు పవడం చూస్తుంటే ఆక్యుపెన్సీలు బలంగా ఉన్నాయి. చాలా చోట్ల స్క్రీన్లు యాడ్ చేస్తున్నారు.  వరుణ్ తేజ్ ఈ బోర్డు చూసి ఎంత కాలమయ్యిందో వెంటనే చెప్పడం కష్టం.

Exit mobile version